ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా పెద్ద తప్పు – జగన్ పై షర్మిల ఫైర్

-

ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా పెద్ద తప్పు అని వైఎస్‌ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

దీనికి సంబంధించిన బిల్లును నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే.. దీనిపై పాదయాత్రలో వైఎస్‌ షర్మిల స్పందించారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్‌ పేరు మార్చడం ముమ్మాటికీ తప్పేనని.. అలా ఎన్ని రోజుల మార్చుకుంటూ పోతారని నిలదీశారని నిప్పులు చెరిగారు. తప్పు ఎవరు చేసినా.. తప్పేనన్నారు.

ఇది ఇలా ఉండగా.. ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చిన పరిగి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ మద్దతు, ఆశీర్వాదంతో తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తా. వైయస్ రాజశేఖర రెడ్డిలాగే పరిపాలిస్తా. ప్రజల కష్టాలు తీరుస్తానని షర్మిల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version