వైఎస్ హయాంలో మంత్రిగా పని చేసి వైఎస్ జగన్ మీద కేసులు వేసిన సోనియా వీర విధేయుడు శంకర్రావు చానాళ్ళ తరువాత మీడియా ముందుకు వచ్చారు. అప్పట్లో నేను ప్రముఖ డాక్టర్ నన్న ఆయన నా వద్దకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు వైద్యం కోసం వచ్చే వారన్నారు. 14 రకాల ప్రభుత్వ రంగ సంస్థలకు ప్యానెల్ డాక్టర్ గా ఉండేవాడినని కరోనా వైరస్ – వైద్యం పట్ల నాకున్న ఆలోచనలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చానని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీచేస్తున్న పనులు నచ్చి ఆయనకు భారత రత్న ఇవ్వాలని రాష్టపతిని కోరుతున్నానని అన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి, ఆరున్నర సంవత్సరాలు ప్రధానిగా ఉంటూ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని కరోనా మహమ్మారి వంటి రోగాలు ప్రభల కుండ ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు. స్వచ్ఛ భారత్, Gst, త్రిబుల్ తలాక్ మంచి పేరు తెచ్చాయని, అందుకే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో నరేంద్రమోదీ పేరు నమోదు చేయాలని అన్నారు. అయితే బీజేపీలోకి వెళ్లనన్న ఆయన నేను నా అభిప్రాయాలను మాత్రమే చెప్పానని అన్నారు.