ఈ సారి మరో ఆసక్తికరమైన పాయింట్ తో శంకర్..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు.ఈ సినిమా తో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తున్నాడట.అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా ఎలక్షన్ ప్రచారం కు సంబందించిన సీన్లు విశాఖ పట్టణం ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ లోకేషన్స్ సీన్లు లీక్ అయి మీడియా లో వైరల్ గా మారాయి. ఇందులో రామ్ చరణ్ ఓల్డ్ గెటప్ లో తన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నాడు. దీన్ని బట్టి అందరూ ఇది పొలిటికల్ యాంగిల్ లో జరిగే సినిమా అని హింట్స్ వచ్చాయి.

ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి అయింది.  ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.. ఈ సినిమా ద్వారా శంకర్ ఒక ప్రజలకు పొలిటికల్ గా మంచి మెసేజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.. గతంలో అవినీతి గురించి తన సినిమా లలో చర్చించారు శంకర్. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి.. మన ఓటు అమ్ముకుంటే.. మన పిల్లల బంగారు జీవితాలను అమ్ముకున్నట్టే అనే లైన్ తీసుకొని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో చెప్పబోతున్నాడు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version