ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది ఇప్పటికే సీఎం జగన్ ని గద్దెదించడమే లక్ష్యంగా టిడిపి జనసేన బిజెపిలో జట్టు రాజకీయాల్లో ఇంకో పోతు పొడిచింది. కాంగ్రెస్ వామపక్షాల మధ్య ఎట్టకేలకు పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కరారు అయిపోయింది. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కలిపి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు లెఫ్ట్ పార్టీలతో పొత్తు అధికారికంగా ప్రకటించారు.
ఈనెల 26వ తేదీన అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు, ఈ సభకి మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు అధికార వైసీపీని ఎన్నికల బరిలో ఢీ కొట్టాలంటే కలిసి పోరాడాలని ఈ సందర్భంగా షర్మిల తన అభిప్రాయాన్ని చెప్పారు.