సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం లో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం మనకి తెలుసు. ఆమె డెడ్ బాడీ ని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో కాసేపటి క్రితం పోస్టుమార్టం పూర్తి చేయడం జరిగింది. మారేడుపల్లిలో తండ్రి సాయన్న సమాధి పక్కన అంతేక్రియలు చేయబోతున్నారు.
లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటన మీద భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వలన ఇలా జరిగిందని పోలీసులు అంచనాలకు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి