ఆత్మీయ సభలో షర్మిల కీలక వాఖ్యలు..

-

హైదరాబాద్, రంగారెడ్డి వైఎస్ అభిమానులు, ఆత్మీయ సభలో షర్మిల కీలక వాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ చనిపోతే , దుఃఖoతో చనిపోయిన  వాళ్ళలో తెలంగాణ వాళ్ళే ఎక్కువ అని ఆమె అన్నారు. ప్రతి రైతు లక్షాధికారి కావలనుకున్నాడు,   ప్రతి విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగా చదవాలన్నాడు. అలానే పేదలకు అనారోగ్యం వస్తే భరోసా ఇవ్వాలనుకున్నారని అన్నారు. 

తెలంగాణ లో రాజన్న రాజ్యం రావాలని,  సంక్షేమ పాలన రావాలి అనేదే నా లక్ష్యం అని ఆమె అన్నారు. అందరూ తోడుంటే రాజన్న రాజ్యం తెస్తానని ఆమె అన్నారు. అలానే అంతకు ముందు ఆమె పదిహేను ప్రశ్నలతో కూడిన ఫీడ్ బ్యాక్ ఫాం వచ్చిన అందరి చేత నింపించారు. ఆ తరువాత ఆమె లోటస్ పాండ్ బయటకు రాగా ఆమెను అభిమానులు గజమాలతో సత్కరించారు. ఇక ఆమె పార్టీ ప్రకటించడమే బాకీ అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version