బీసీలంటే షర్మిలకు చిన్నచూపు.. సొంత పార్టీనేతలే ఆగ్రహం

-

ఈరోజు మహాత్మ జ్యోతి రావు ఫూలే జయంతి దేశం లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మన దేశంలో మునుషులంతా సమానత్వంతో జీవించాలని పోరాడిన వ్యక్తి, ఆధితప్య విలువలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆలోచనలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటిది వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల గారు పూలే జయంతికి ఎక్కడా కనిపియ్యలేదు. ఇలాంటి కార్యక్రమాలకు షర్మిల దూరంగా ఉండటం ఇదేం కొత్త కాదు. ఇది మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా, ఆమె పలువురు సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతికి ఎక్కడా కనబడలేరు. ఈ నేపధ్యం లో తమ సొంత పార్టీ నేతలే షర్మిల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీసీలంటే షర్మిలకు చిన్న చూపని, అందుకే వివక్ష చూపుతోందని వారు ఆమె పై మండిపడుతున్నారు. బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచిన వారిపై ఇలా వివక్ష చూపడం తగునా? అని సొంత పార్టీ నేతలే ఆమెపై చాలా కోపంగా ఉన్నారు. షర్మిల ఇకనైనా తన వైఖరి మార్చుకుంటే దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఆమెకు మద్దతుగా నిలుస్తారని, లేదంటే బీసీల మద్దతు దొరకదని మండిపడ్డారు. నిరుద్యోగ దీక్షకు మద్దతు తెలపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి లేఖ రాసిన షర్మిలకు ఫూలే జయంతికి హాజరయ్యే తీరిక లేకుండా పోయిందా? అని షర్మిల పై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version