మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో నాన్ బీజేపీ రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వెల్లడించారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని అభిప్రాయపడుతూ తెలంగాణ ప్రభుత్వ డిజిటిల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్ కూడా తన కామెంట్ జోడించారు.
ఈ సందర్భం లో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దేశంలో ప్రజాపాలన చాలా బాధాకరంగా సాగుతోందన్నారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవుల్లో ఉన్నవారు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాజకీయ పావులుగా మారినట్లు తెలియచేశారు కేటీఆర్. నాన్ బీజేపీ రాష్ట్రాలను ఓసారి గమనించండి అని, కేంద్రం ఆ రాష్ట్రాలకు సహకరించడం లేదని, ప్రతీకారేచ్ఛతో వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు. సహకార సమాఖ్య పాలనకు ఇదేమైనా మోడల్‌గా ఉంటుందా అని అడిగారు కేటీఆర్. టీమ్ ఇండియా స్పూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఏ విధంగా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.