మోసానికే బ్రాండ్ అంబాసిడర్.. ఏపీ ప్రభుత్వంపై షర్మిల ట్వీట్..!

-

2.32లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు, 23వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మీరు 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి అని షర్మిల అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అని, జంబో డీఎస్సీ అని APPSC నుంచి వరుస నోటిఫికేషన్లు ని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచారు అని షర్మిల పోస్ట్ చేశారు.

అలానే మోసానికే బ్రాండ్ అంబాసిడర్ అని, మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం అని షర్మిల పోస్టులో పెట్టారు. నేటికీ శాఖల పరిధిలో 2.25లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మీ మార్క్ పాలనకు నిదర్శనం అని పోస్ట్ చేసారు షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version