YS SHARMILA: పేపర్ లీక్ లో ప్రభుత్వ పాత్ర లేదా ?

-

తెలంగాణను ఒక 20 రోజులుగా కుదిపేస్తున్న ఏకైక సమస్య TSPSC గ్రూప్ 1 మరియు టెన్త్ పేపర్ ప్రశ్నపత్రాలు లీక్ సమస్య అని చెప్పాలి. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా తయారయింది. కాగా ఈ విషయం పై రాజకీయ నాయకులు అంతా తమ స్పందనను తెలియచేస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల TSPSC పేపర్ లీక్ గురించి SIT ను ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు ప్రత్యేక విచారణ అధియాక్ర బృందం కొంతమందిని విచారణ చేసి కేవలం ఇద్దరే ప్రధాన నిందితులు అని తేల్చింది.

ఈ విషయం నమ్మేలా లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇదంతా చూస్తుంటే కేవలం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన విచారణా క్లియర్ గా అర్థమవుతోంది అంటూ ప్రశ్నించింది. ఇంతకు ముందు నీరు గారిపోయిన డ్రగ్స్ కేసు మరియు ఎమ్మెల్యే ల కేసు లాగా దీనిని కూడా SIT వృదా చేస్తోందని ఆమె ఆరోపించింది. 15 పేపర్ లు లీక్ అయ్యే వరకు అసలు విషయం తెలియలేదంటే, ప్రభుత్వం పాత్ర లేదంటారా అంటూ ఈమె సూటిగా ప్రశ్నించింది. మరి దీనిపై SIT కానీ, లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version