BREAKING : ఇవాళ ఢిల్లీకి వైఎస్ షర్మిల

-

BREAKING : ఇవాళ ఢిల్లీకి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. రేపు చలో పార్లమెంట్ కు పిలుపు నిచ్చారు వైఎస్‌ షర్మిల. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీకి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు… అవినీతిపై వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు షర్మిల. ఈ తరుణంలో… ఢిల్లీకి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు.

కాగా, తెలంగాణ మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? అని వైఎస్ షర్మిల ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఉన్నది ముఖ్యమంత్రి బిడ్డ కోసమేనా? లేక రాష్ట్రంలోని మహిళలందరి కోసమా? మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించడం సంతోషమన్నారు. అదే మేము మీకు వందల సార్లు కంప్లైంట్ చేస్తే ఎందుకు స్పందించలేదు… మీలో చలనం ఎందుకు రాలేదు? అని నిలదీశారు. నేను ముఖ్యమంత్రి బిడ్డను కాదనా? లేక సాధారణ మహిళల కోసం మీ కమిషన్ పనిచేయదా? మంత్రి నిరంజన్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని మంగళవారం మరదలు అంటే మీకు కనపడలేదు.. కేటీఆర్ వ్రతాలు చేసుకోండి అని అవమానిస్తే మీకు కనపడలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version