తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరం ఊహించలేము. అయితే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇంటికి వెళ్లారు జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే పార్టీ నేత శశికళ. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే ఆయన భార్య తో దాదాపు 50 నిమిషాల పాటు శశికళ భేటీ అయ్యారు.
అయితే ఈ సమావేశానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం అందుతోంది. కేవలం వ్యక్తిగతంగానే శశికళ… సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసినట్లు సమాచారం అందుతోంది. చెన్నైలోని బోయ్స్ గార్డెన్ లో ఉన్న రజినీకాంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇటీవల శస్త్రచికిత్స చేసుకున్న రజనీకాంత్ ఆరోగ్యం పై ఈ సందర్భంగా శశికళ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు అందుకోవడం పై రజనీకాంత్ ను శశికళ అభినందించారు. అయితే వీరిద్దరి వీటితో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.