కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి ? అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. కేటీఆర్ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి.. నా నియోజక అభివృద్ధి గురించే మాట్లాడుతానని చురకలు అంటించారు ఎమ్మెల్యే రాజా సింగ్. Mim ఎమ్మెల్యే ల లాగా భూ కబ్జాల గురించి కలవాలని అనుకోవడం లేదని.. సీఎం కెసిఆర్.. ఎలాగూ సొంత మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వరు… మీరు వారి దారిలో నడవకండని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.
ప్రతిపక్షాలకు సమయం ఇవ్వని కేసీఆర్ అలవాటు కేటీఆర్ కు వచ్చిందని ఫైర్ అయ్యారు. నియోజకవర్గం సమస్యల పై కేటీఆర్ ను కలవాలని వందల సార్లు ప్రయత్నించినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై తనను కలవాలని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. అసెంబ్లీలో సాక్షిగా ఇచ్చిన మాటను కేటీఆర్ తప్పారని.. కేటీఆర్ కి పంపించిన వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ని మీడియా కు పంపించారు ఎమ్మెల్యే రాజా సింగ్.