Shathamanam Bhavathi : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు బాగా ఆడుతున్నాయి. అయితే 2017 సంవత్సరంలో వచ్చిన శతమానం భవతి సినిమా కూడా కుటుంబ నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు బిగ్నేష్ సతీష్ దర్శకత్వం వహించారు.

దిల్ రాజు నిర్మతగా ఉన్నారు. ఈ సినిమా 2017 సంవత్సరం జనవరి 14వ తేదీన అంటే సంక్రాంతి కానుకగా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తయింది. ఇలాంటి నేపథ్యంలో చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. శతమానం భవతి సీక్వెల్ కూడా రాబోతుందని తెలిపింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి వరకు రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటన చేసింది చిత్ర బృందం.
https://x.com/SVC_official/status/1746750945659428888?s=20