తొలి మ‌హిళా సీఎస్‌గా బాధ్యత‌ల స్వీక‌ర‌ణ సంతోషంగా ఉంది : శాంతి కుమారి

-

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని శాంతి కుమారి తెలంగాణ నూతన సీఎస్‌గా నియమిస్తూ సీఎ కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. త‌న‌పై ఎంతో న‌మ్మ‌కంతో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు సీఎస్ శాంతి కుమారి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తొలి మ‌హిళా సీఎస్‌గా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ సంతోషంగా ఉంద‌న్నారు. సీఎం కేసీఆర్ త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా రాష్ట్ర అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతో పాటు అన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషిచేస్తాను అని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు శాంతి కుమారి. 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతి కుమారి.. సీఎస్‌గా 2025, ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version