రేప్ కి గురైనా అన్న ప్రాణాలు కాపాడిన మహిళ…!

-

లాక్ డౌన్ లో జనం ఇళ్లకే పరిమితం అయినా సరే రేప్ సంఘటనలు మాత్రం ఆగడం లేదు. కామందులు చెలరేగిపోతూనే ఉన్నారు దేశంలో. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక సంఘటన జరిగింది. 18 ఏళ్ళ అమ్మాయి మీద తన సోదరుడి తో కలిసి తన గ్రామానికి తిరిగి వెళ్తుండగా ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేసారు.

వీరిలో ముగ్గురు మినార్లు ఉన్నారు. ఏప్రిల్ 29-30 మధ్య ఈ సంఘటన జరిగింది. ఆమె సోదరుడ్ని బావిలో తోసేసారు. ముగ్గురు మైనర్లతో సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఇద్దరు పరారీలో ఉన్నారని అధికారులు. కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రాజేంద్ర ధుర్వే కథనం ప్రకారం… బుధవారం రాత్రి తన 21 ఏళ్ల సోదరుడితో కలిసి మోటారుబైక్‌పై తిరిగి తమ గ్రామానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఏడుగురు నిందితులు బైక్‌ను అడ్డగించి, రాత్రి 8.30 గంటల సమయంలో సోదరుడిని బావిలో తోసేసి అత్యాచారం చేసారు. నిందితులు గురువారం తెల్లవారుజామున 2 గంటల వరకు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి గురైనా సరే తన సోదరుడ్ని బావి నుంచి రక్షి ఉదయం గ్రామానికి చేరుకుంది ఆ మహిళ. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసారు. నిందితులపై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారం), 365 (కిడ్నాప్), 307 (హత్యాయత్నం) కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news