ఎమ్మార్వో పదవిలో ఉండి… బొమ్మ తుపాకీతో దొరికిపోయాడు…!

కొంత మంది ఉద్యోగాలు ఉన్నా సరే అనవసరంగా జీవితాలు నాశనం చేసుకుంటారు.  తాజాగా వికారాబాద్ లో ఎయిర్ గన్ తో కలకలం రేపింది. నిందితుడు షేక్ ఫయాజ్ అహ్మద్ గా గుర్తించిన పోలీసులు… అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ సివిల్ సఫ్లయ్ లో డిప్యూటీ తహసీల్దార్ గా షేక్ ఫయాజ్ అహ్మద్ పని చేస్తున్నాడు. షేక్ ఫయాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

షేక్ ఫయాజ్ అహ్మద్ దగ్గర ఉన్న గన్ ఎయిర్ గన్(బొమ్మ తుఫాకి) గా పోలీసులు తేల్చారు. రాత్రి సమయం లో మద్యంమత్తులో ఇంటి పక్కన ఉన్న ఫణీత్ తో వాగ్వివాదంకు దిగి ఉదయం పోలీసులు సంఘటన స్థలంలో వివరాల సేకరించారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం విధుల నుంచి సస్పెండ్ చేసారు.