వారి కారణంగానే ఢీ షో వదిలేసాను అంటున్న శేఖర్ మాస్టర్..!!

-

శేఖర్ మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శేఖర్ మాస్టర్ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు మంచి కొరియోగ్రఫీ అందించి ఇంకాస్త అభిమానులను సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఢీ వంటి డాన్స్ ప్రోగ్రాం కు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన ఆ తర్వాత ఆ షో లోనే జడ్జిగా వ్యవహరించే స్థాయికి చేరారు అంటే ఇక ఆయన టాలెంట్ ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన కొరియోగ్రఫీతో ఎంతో మంది స్టార్ హీరోలను సైతం మెప్పించిన ఈయన ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ క్రమంలోనే ఇంత గుర్తింపు ఉంది కాబట్టి శేఖర్ మాస్టర్ ఒక సాంగుకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తే సుమారుగా 5 లక్షల రూపాయల వరకు తీసుకుంటారు అని సమాచారం. ఇదిలా ఉండగా ఎన్ని రోజులు ఢీ డాన్స్ ప్రోగ్రాం లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈయన ఉన్నట్టుండి గుడ్ బాయ్ చెప్పడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయనే సమాచారం కూడా అందింది. ఇక ఒక్కొక్కరు ఒక్కోరకంగా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న నేపథ్యంలో నేరుగా శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమాల వల్ల ఢీ షో కి కొన్ని వారాలపాటు బ్రేక్ తీసుకున్నాను . ఇక ఆ సమయంలో కామెడీ స్టార్స్ షో కి కూడా జడ్జిగా పనిచేసే అవకాశం రావడంతో అక్కడ అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి వచ్చింది..

ఇక కామెడీ స్టార్ట్స్ నిర్వహకులు ఏదైనా ఒక షోలో మాత్రమే చేయాలి అని చెప్పడంతో అగ్రిమెంట్ తీసుకున్నాను కాబట్టి ఢీ షోలో పాల్గొనలేకపోయాను అంటూ వివరణ ఇచ్చారు శేఖర్ మాస్టర్. ఇకపోతే ఈ షో నుంచి సుధీర్, ఆది లాంటి వారు కూడా వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ షో కి అంత టిఆర్పి రేటింగ్ కూడా లేదు అని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version