Shilpa shetty:‘ముద్దు’ కేసులో శిల్పాశెట్టికి ఊరట

-

ఒపెన్‌ స్థలంలో అసభ్యకరంగా ప్రవర్థించిన కేసు నుంచి బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టికి భారీ ఊరట లభించింది. 2007 లో రాజస్థాన్‌ లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్‌ ప్రచారం కార్యక్రమం సందర్భంగా హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ గెరే… శిల్పాశెట్టిని వేదికపైనే కౌగిలించుకోవడం… ఆ తర్వాత వరుస ముద్దులు ఇవ్వడం తెలిసిందే.

ఆ సమయంలో శిల్పాశెట్టి వద్దంటున్నా గెరే రెచ్చి పోయి ఆ పని చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ఇందులో సంబంధించి శిల్పాశెట్టి, రిచర్డ్‌ గెరేకు వ్యతిరేకంగా రెండు కేసులు నమోదు అయ్యాయి. అశ్లీలత, అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అభియోగాలు మోపారు.

15 ఏళ్ల తర్వాత ఈ కేసులు కొలిక్కి వచ్చింది. తొలుత రాజస్థాన్‌ లో నమోదైన కేసులను శిల్పాశెట్టి అభ్యర్థనపై ముంబై మెట్రోపాలిటన్‌ కోర్టుకు బదిలీ చేసేందుకు లోగడ సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ వివాదంలో శిల్పాశెట్టిని బాధితురాలిగా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కేతకి చవాన్‌ అభివర్ణించారు. నాడు ఘటన జరిగిన వెంటనే శిల్పాశెట్టి దీనిపై స్పష్టత విషయాన్ని ఆయన గుర్తు చేశారు. శిళ్పాశెట్టికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అభియోగాలు ఆధారరహితమని పేర్కొంటూ కొట్టి వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version