సోనూకు అభిమానిగా మారిన శిల్పా తనయుడు..ఏంచేశాడంటే…!

-

నటి శిల్పాశెట్టి ఎనిమిదేళ్ల తనయుడు వియాన్‌… సోనూకు అభిమానిగా మారిపోయాడు. తన స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసం సోనూ సేవలను కొనియాడుతూ ఓ యానిమేటెడ్‌ వీడియోను రూపొందించాడు వియాన్‌. ఆ వీడియో చూసిన శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనయ్యారు. తన కొడుకు రూపొందించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. మన చుట్టూ జరిగే ప్రతి విషయాన్నీ చిన్నారుల సైతం గమనిస్తుంటారని… స్కూల్‌ ప్రాజెక్ట్‌ కోసం తన కొడుకు చేసిన యానిమేటెడ్‌ వీడియో చూసి తాను ఎంతగానో సంతోషించానన్నారు.

గత కొన్ని నెలల నుంచి దేశంలో జరుగుతున్న విషయాలను వియాన్‌ గ్రహిస్తున్నాడన్నారు. దీనిలో భాగంగానే తన స్నేహితుడు సోనూసూద్‌ చేసిన సేవలకు వియాన్‌ ఫిదా అయిపోయాడని తెలిపారు. వియాన్ వర్క్‌ చూసి గర్వంగా ఫీల్‌ అయ్యానన్నారు శిల్పాశెట్టి.

Read more RELATED
Recommended to you

Latest news