దుమ్ము లేపుతున్నా అక్ష‌య్ కుమార్ ల‌క్ష్మీ బాంబ్ ట్రైల‌ర్..!

-

తెలుగు ఇండస్ట్రీలో లారెన్స్ తెర‌కెక్కించిన హార‌ర్ మూవీ సీక్వెన్సెస్ కు బాగా పేరు వచ్చింది. అందుకేనేమో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు లారెన్స్ చిత్రీకరించిన ముని 2కు రీమేక్‌ మూవీ చేస్తున్నారు.ఈ సినిమాకు హిందీలో ల‌క్ష్మీ బాంబ్ అనే పేరు కూడా పెట్టిన విషయం తెలిసిందే. రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్షయ్ ట్రాన్సజెండర్ గా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని సినిమా థియేటర్ లలో కాకుండా న‌వంబ‌ర్ 9న ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఈ రోజు ఉద‌యం విడుదల చేశారు.ట్రైలర్ ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకునేలా ఉంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే అక్షయ్ దెయ్యాలు, భూతాలను పెద్దగా పట్టించుకోని వ్యక్తిలా కనిపిస్తాడు ఈ సినిమాలో. దెయ్యాలు, భూతాల‌నేవి లేవు అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా, దెయ్యాన్ని చూసిన రోజు నేను గాజులు వేసుకుంటా అంటూ అక్ష‌య్ సీరియ‌స్‌గా డైలాగ్ చెప్తారు. అలాగే మ‌రో సీన్‌లో హీరో ఎరుపు రంగు చీర ధ‌రించి నేను ఎలా ఉన్నాను చెప్పండి. బావున్నా క‌దూ.. న‌న్ను వ‌దులు.. న‌న్ను ముట్టుకోవ‌డానికి నీకెంత ధైర్యం అంటూ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని రేపాడు. ఈ చిత్రం రీమేక్ హిందీ ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టుగా చిత్రీకరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news