ముదురుతున్న షిర్డీ వివాదం..!

-

మహారాష్ట్రలోని షిరిడిలో సాయి జన్మభూమి వివాదం క్రమంగా ముదురుతుంది. ప్రభుత్వం పర్బాన్ జిల్లాలోని పత్రికి వంద కోట్ల నిధులు కేటాయించడం, సాయి బాబా జన్మస్థలంగా ప్రకటించడంపై షిరిడిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. ఆలయాన్ని మూసివేయకపోయినా సరే షిర్డీ గ్రామస్తులు బంద్ కి పిలుపునిచ్చారు.

దీనితో ఆ ప్రాంతంలో బంద్ కొనసాగుతుంది. దుకాణాలు అన్ని కూడా మూసివేసారు. వ్యాపారులు కూడా స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఉద్దావ్ థాకరే దిగి వచ్చే వరకు ఇది కొనసాగుతుందని స్పష్ట౦ చేసారు. బిజెపి సహా కొన్ని పార్టీలు షిర్డీ కి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక గ్రామస్తులు అందరూ షిరిడిలో ర్యాలీ చేయగా దానికి భక్తులు కూడా మద్దతు ఇచ్చారు.

పత్రీలో సాయి జన్మించారని ఆ తర్వాత 16 ఏళ్ళ వయసులో షిరిడి వచ్చారు అనే విషయాన్ని చరిత్ర చెప్తుంది. అక్కడే ఆయన సమాధి కూడా అయ్యారట. దీనితో జన్మభూమిగా పత్రీ, కర్మ భూమిగా షిరిడి ని గుర్తించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే షిరిడి ప్రాధాన్యత తగ్గించడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version