వైరల్; రేణు దేశాయ్ పక్కన పడుకున్న పిల్లలు ఎవరు…?

-

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి సినిమాల్లో ఎంత పాపులారిటి వచ్చిందో తెలియదు గాని ఆమె పవన్ ని పెళ్లి చేసుకుని, విడిపోయి, ఆ తర్వాత సోషల్ మీడియాలో చేసే హడావుడితో విపరీతమైన పాపులారిటి వచ్చేసింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాగే చేసారు రేణు.

వివరాల్లోకి వెళితే, తన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్‌కి కారులో బయల్దేరింది వెళ్తున్న రేణు దేశాయ్… ఓ గ్రామంలోంచీ కారు వెళ్తుండగా, ఆ విలేజ్ దాటితే హైదరాబాద్ వస్తుంది. అప్పుడు రేణు తన ప్రొడక్షన్ డిజైనర్ తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని మనసులో మాట బయటపెట్టగా, సరిగా అదే సమయానికి కారు తీర్ పంక్చర్ అయింది.

వెంటనే కారు దిగేసి ఆ గ్రామస్తులను కలిసింది. రేణు రాగానే సంబరపడిన గ్రామస్తులు వాళ్లకు తినడానికి లేకపోయినా సరే ఆమెకు ఉప్మా, టీ ఇచ్చారు. చలిగా ఉండటంతో మంట కూడా వేసారు. ఆ రాత్రి ఆమె వారితోనే నిద్రపోయింది కూడా. ఈ విషయాలు అన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది రేణు. “మన దగ్గర ఎంత డబ్బుండీ ఏం లాభం… దాన్ని దానం చెయ్యడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం.

కానీ వాళ్లు… తమ దగ్గర ఏమీ లేకపోయినా… మనకు ఎన్నో ఇచ్చారు. వాళ్ల నుంచీ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది” అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామంలో ఉన్న చిన్న పిల్లలతో కలిసి ఆమె దిగిన ఫోటోకు మంచి స్పందన వస్తుంది. గ్రామాలు ఎప్పుడు మంచివే అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version