కోట్లు పోగొట్టుకున్న.. ఆమె వల్లే మళ్లీ.. ఎమోషనల్ అవుతున్న శివబాలాజీ.!

-

హీరోగా కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి.. తన మార్క్ నటనతో ఆకట్టుకున్న నటుడు శివ బాలాజీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆర్య సినిమాలో అజయ్ అనే విలన్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శివబాలాజీ తన తోటి నటి మధుమితను వివాహం చేసుకున్నాడు. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఈయన నటన మీద దృష్టితో ఇండస్ట్రీలోకి కష్టపడి వచ్చాడు . చెల్లెలు పాత్రలకు బ్రాండ్ గా ఉన్న మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన .. ఒక సందర్భంలో తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ కెరియర్ కొనసాగించిన ఈయన ఇండస్ట్రీపై ప్రేమతో అడుగుపెట్టాడు. ఇక్కడ స్టార్డం మాత్రం సాధించలేకపోయాడు. తర్వాత బిగ్ బాస్ సీజన్ వన్ లో ఎంట్రీ ఇచ్చి విన్నర్ గా నిలిచాడు శివబాలాజీ. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని..” నేను నా జీవితంలో కోట్ల ఆస్తులు నష్టపోయాను.. కానీ ఇప్పుడు ఇలా బ్రతికి ఉన్నాను అంటే అది నా భార్య సహకారం వల్లే అంటూ తెలిపారు. ముఖ్యంగా తాను చేసిన వ్యాపారాలు , వాటి నష్టాల గురించి కూడా వెల్లడించారు. మొదటిసారి ఈమూ పక్షుల పెంపకం, తర్వాత ఆయిల్ వ్యాపారం , ఆ తర్వాత సినిమా నిర్మాత ఇవన్నీ కూడా నష్టాలే తెచ్చిపెట్టాయని తెలిపాడు.

ఒకసారి నేను నా ఫ్రెండ్స్ తో కలిసి 500 ఈమూ పక్షులతో బిజినెస్ మొదలు పెట్టాము . నెలకు రూ.5 లక్షలకు పైగా ఖర్చు పెట్టాము. అంత కష్టపడితే ఈ పక్షులు మార్కెట్ చేయడానికి అవకాశం లేదని తెలిసింది. దాంతో అందులో పెట్టిన డబ్బంతా పోయింది. ఆ తర్వాత మరొక వ్యాపారం, ఆ తర్వాత సినిమా నిర్మాత ఇలా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాను . అంత నష్టం చూసేసరికి మానసికంగా పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. కానీ నా భార్య నా వెంటే ఉండి నాకు ధైర్యం చెప్పి.. నన్ను మామూలు మనిషిని చేసింది..” అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు శివ బాలాజీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version