మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాధి కూటమిలోకి ఎంఐఎంను రానివ్వమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఎంఐఎంతో పొత్తు అంటే.. రోగాన్ని అంటి పెట్టుకోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాధి కూటమిలోకి ఎంఐఎం ను చేర్చుకోవాలనే ఆలోచిన, అవకాశాలు ఇంచు కూడా లేవని తెల్చి చెప్పారు. ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లే వాళ్లతో శివ సేన ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు.
తమ పార్టీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలతో పని చేస్తుందని అన్నారు. శివాజీ మహారాజ్ అడుగు జాడల్లో నడిచే పార్టీ తమదని అన్నారు. అలాగే ఎంఐఎం పార్టీ.. బీజేపీ తో రహాస్య ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ రహాస్య ఒప్పందం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ద్వారా మరో సారి తెలిసిందని అన్నారు. గతంలో కూడా ఎంఐఎం – బీజేపీ రహాస్య పొత్తు బయటకు వచ్చిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అలాంటి పార్టీలకు తాము దూరంగా ఉంటామని తెల్చి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆ పార్టీలతో కలవబోమని అన్నారు.