ఈ నెల 21 టీఆర్ఎస్ఎల్పీ భేటీ.. కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాసేప‌టి క్రితం ఎర్ర‌వెళ్లిలో ఉన్న త‌న ఫామ్ లో హౌస్ లో ఎమ‌ర్జెన్సీ స‌మావేశం నిర్వ‌హించిన విషయం తెలిసిందే. ఈ స‌మావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు కీల‌క అధికారులు కూడా హాజ‌రు అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. వ‌రి ధాన్యం కొనుగోలుపై మ‌రో సారి కేంద్రంతో పోరాడ‌టానికి కేసీఆర్ సిద్ధం అయినట్టు స‌మాచారం. అందు కోసం మంత్రులతో క‌లిసి స్వ‌యం కేసీఆర్ ఢిల్లీకి వేళ్లాల‌ని నిర్ణ‌యం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది.

కాగ కేసీఆర్ ఢిల్లీ ప్ర‌యాణానికి ముందు.. ఈ నెల 21 (సోమ వారం) రోజు టీఆర్ఎస్ శాస‌న స‌భ ప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలే కాకుండా.. ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జ‌డ్పీ చైర్మెన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ల అధ్యక్షులతో పాటు రైతు బంధు స‌మితుల జిల్లా అధ్యక్షులు కూడా హాజ‌రు కావాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

కాగ ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుబోతున్న‌ట్టు స‌మాచారం. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుబోతున్న‌ట్టు తెలుస్తుంది. దీంతో పాటు పార్టీ ప‌రంగా కూడా ప‌లు కీల‌క నిర్ణాయాలు కూడా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news