ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.శివ బాలకృష్ణ కేసులో ఆయన సోదరుడు నవీన్ కుమార్ కూడా అరెస్ట్ అయినాడు.హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్‌కు ఏసీబీ కోర్టులో షాక్ తగిలింది .నాంపల్లి ఏసీబీ కోర్టు నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను 3 రోజుల క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది.
శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు ఏబీసీ రూ.250 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించింది. ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆయన బినామీలను విచారించారు. మరోవైపు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.