ప్రచారంలో పడిపోయిన పలమనేరు కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్..!

-

పలమనేరు లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యం లో సభను నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ ప్రసంగిస్తూ ప్రచార వాహనం మీద నుండి కింద పడిపోయారు. కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా పలమనేరు లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో ఈ సభని జరపగా ఇందులో శివశంకర్ మాట్లాడుతున్నప్పుడు ప్రచార వాహనం మీద నుండి కింద పడిపోయారు.

షర్మిల తో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే కాంగ్రెస్ శ్రేణులు, బౌన్సర్ల సహాయంతో ఆయనని వాహనంపై ఎక్కించారు తర్వాత ఆయన మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దెబ్బలు ఏమి తగ్గలేదు వెంటనే వాహనం పైకి ఎక్కి ప్రసంగాన్ని కొనసాగించారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్

Read more RELATED
Recommended to you

Latest news