అక్కడ శివ లింగం స్వయంగా శ్రీ రాముడే ప్రతిష్టించాడు . ఇది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది.దీనిని ఉత్తర రామేశ్వరం అంటారు.ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?ఈ ఆలయం తెలంగాణాలో సమీపంలో రాయకల్ నుంచి నాలుగు కిలో మీటర్లు దూరంలో ఉన్న పంచముఖ గుట్ట మీద ఉంది. దీన్ని స్వయంగా ఉత్తర రామేశ్వరంగా పేరు గాంచిన ఈ ఆలయాన్ని స్వయంగా శ్రీ రాముడే ప్రతిష్టించాడని స్తల పురాణం.
దీనికి నిదర్శనంగా ఆ శివలింగం పై రామ బాణం గుర్తు ఉంటుంది.రాక్షస రాజైన రావణాసురుని సంహరించి సీత సమేతంగా అయోధ్యకు బయలు దేరిన శ్రీ రాముడు దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలో బదరి వృక్షం కింద శివ లింగాన్ని ప్రతిష్ట చేసి పూజించారని భక్తుల నమ్మకం.కాల క్రమంలో ప్రకృతి విపత్తుల కారణంగా ఆ లింగాకారం కొన్ని వందల సంవత్సరాలు భూగర్భం లోఉండిపోయినట్టు చరిత్ర చెబుతుంది.
ఒకసారి నరసింహరాయలు రామేశ్వర గుట్టల మద్య తపస్సు చేస్తుండగా రామలింగేశ్వరుడు కలలో కనిపించి బదరి చెట్టు కింద ఉన్నాను అని చెప్పి అంతర్దానమైయ్యాడు. అప్పుడు అయన ఆ లింగాన్ని వెతికి తీసి ఆలయం నిర్మించి పూజలు చేసాడు. తరువాత నరసింహరాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని, కోనేరుని నిర్మించి అభివృద్ధి చేసినట్టు చెబుతారు. మహాశివ రాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇది ఏట పెరుగుతుంది అనటానికి నిదర్శనంగా లింగాకారం మీద పగిలిన గీతలు కనపడతాయి.