ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం… అతి త్వరలోనే మెగా వేలం జరగనుంది. ఈ తరుణంలో ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ఇవాళ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఇవాళ సాయంత్రం లోపు రిటెన్షన్ లిస్టును… ఐపీఎల్ యాజమాన్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శివం దుబేకు ఏకంగా 18 కోట్లు ఇస్తున్నారంట. 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకోబోతున్నారట. అలాగే ఋతురాజు గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, మతిషా పతిరన, లాంటి ప్లేయర్లను మాత్రమే రిటర్న్ చేసుకొని ఉన్నట్లు సమాచారం అందుతుంది. అలాగే… న్యూజిలాండ్ బ్యాటర్లు డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర , లాంటి ప్లేయర్లను వదిలేయనున్నట్లు తెలుస్తోంది.