‘నాటు నాటు’ పాటపై డ్యాన్స్‌.. రామ్ చరణ్ కు స్పెషల్ పర్సన్ సర్ ప్రైజ్..?

-

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది ఆ పాటకు స్టెప్పులేశారు. కొంత మంది సెలబ్రిటీలు కూడా కాలు కదిపారు. అప్పటి నుంచి ఈ పాటపై సోషల్ మీడియాలో తెగ వీడియోలు వస్తూనే ఉన్నాయి. కేవలం ఇండియన్ ఆడియెన్సే కాదు.. విదేశీ సినిమా ప్రేక్షకులు కూడా ఆ పాటకు చిందులేశారు. అయితే ఇప్పుడు ఈ పాటపై మరో సెలబ్రిటీ డ్యాన్స్ చేశారు. ఈ సెలబ్రిటీ చాలా స్పెషల్. ఈ పాటలో ఓ భాగమైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు బాగా దగ్గరివారు. ఇంతకీ ఎవరంటే..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’కు గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డులు వరించడంపై నటుడు రామ్‌చరణ్‌ అత్తయ్య, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ శోభన కామినేని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్లినా తన అల్లుడి గురించే అడుగుతున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు దావోస్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆమె.. ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు.

ఇందులో భాగంగా విలేకరితో కలిసి ‘నాటు నాటు’ పాటకు ఆమె కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను సదరు విలేకరి షేర్‌ చేయగా దానిపై ఉపాసన స్పందించారు. ‘‘అల్లుడి ఘనతకు ఆనందంతో గర్విస్తోన్న అత్తయ్య. లవ్‌ యూ అమ్మా’’ అని ఉప్సీ రాసుకొచ్చారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ఆనందిస్తున్నాను. ఇదొక అద్భుతమైన చిత్రంగా పేరు సొంతం చేసుకుంటుందని అనుకున్నాం. అంతర్జాతీయంగా ఈ స్థాయిలో గుర్తింపు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎంతోమంది భారతీయులకు ఆశలు కలిగించింది’’ అని శోభన ఇంటర్వ్యూలో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version