టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మల్లికా.. మల్లికా అంటూ సాగే ఈ పాట చాలా మెలోడియస్ గా ఉంది. ఈ పాటలో సమంత చాలా అందంగా కనిపిస్తోంది. అచ్చం దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఈ సాంగ్ లో సామ్ అలరించింది. ఇక ఈ పాటలో శకుంతల.. దుష్యంత్ కోసం అడవిలో అందాలు ఆరబోస్తూ విరహవేదన అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పాటలో సామ్ ఎక్స్ ప్రెషన్స్ చాలా అందంగా ఉన్నాయి.
ఫిబ్రవరి 17న శాకుంతలం చిత్రం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది. మహా భారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథకి ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరి ప్రేమ కథనే దర్శకుడు గుణశేఖర్ అపురూప దృశ్యకావ్యంగా చూపించబోతున్నారు.
సమంత లాంటి నటి శకుంతలగా నటిస్తుండడంతో ఆ పాత్ర ఎంతలా హైలైట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సమంత నటన, లుక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ పాటకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. రమ్య బెహ్రా ఈ పాటకి గాత్రం అందించారు. చైతన్య సాహిత్యం అందించారు. పౌరాణిక చిత్రానికి అవసరమైన పదాలు ఉపయోగిస్తూ చైతన్య ప్రసాద్ లిరిక్స్ ఇచ్చారు.