ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాలకు మరో షాక్ తగిలింది.ముఖ్యమంత్రి అరెస్ట్, ఈడీ రిమాండ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు శనివారం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు.రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ముఖ్యమంత్రి అరెస్టు, కస్టడీపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ జరుగుతుందని పేర్కొంది. కాగా, ఈడీ కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి, వెంటనే ఆయనను రిలీజ్ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.కాగా, గురువారం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినారు.నిన్న శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టుకు హాజరుపరిచి.. ఈడీ 10 రోజుల కస్టడీకి కోరింది. దీంతో కోర్టు 6 రోజుల పాటు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే