DSC: ఏపీ నిరుద్యోగులకు షాక్.. 16,347 పోస్టులపై వెనక్కి తగ్గింది చంద్రబాబు సర్కార్. ఏపీలో ఈరోజు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలుపడాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈరోజు డీఎస్సీ నోటిఫికేషన్ ను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 16, 347 టీచర్ పోస్టులతో నేడు మెగా డీఎస్సీ ప్రకటించేందుకు తోలుత ప్రభుత్వం రెడీ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు డీఎస్సీని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీ నిరుద్యోగులకు షాక్ తగిలింది.