కర్ణాటకలో సంచలనం సృష్టించిన ముడా ల్యాండ్ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి బుధవారం లోకాయుక్త ఎదుట విచారణకు హాజరయ్యారు. మైసూర్‌లో భూ కేటాయింపులపై ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నేడు ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో అక్టోబర్ 25న సిద్ధరామయ్య సతీమణి పార్వతిని సైతం విచారించారు.
ముఖ్యమంత్రి భార్య పార్వతికి 14 స్థలాలను మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కేటాయించడంతో ముడాలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా ఈ అభియోగాలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. ఇదిలాఉండగా, సీఎం సతీమణి తన పేరు మీద కేటాయించిన స్థలాలను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.