40 ఏళ్లలో మొదటి సారిగా అచ్చెన్న ఫ్యామిలీకి షాక్ !

-

ఏపీ టీడీపీ అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది. సొంత ఇలాఖా అయిన నిమ్మాడ గ్రామంలోనే వీరి కుటుంబానికి చెందిన వ్యక్తి వైసీపీ నుండి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం సంచలనంగా మారింది. నిమ్మాడను సొంతం చేసుకుంటున్న కింజరాపు కుటుంబం 40 ఏళ్లుగా ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సారి వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అచ్చెన్నాయుడి బంధువునే రంగంలోకి దించింది.

మూడు రోజులుగా పోటీ నుంచి కింజరాపు అప్పన్నను తప్పుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. అప్పన్నను నామినేషన్ వేయనివ్వకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి టీడీపీ శ్రేణులు. ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ నడుమ నామినేషన్ దాఖలు చేసిన కింజరాపు అప్పన్న40 ఏళ్ళ రికార్డ్ కు బ్రేకులు వేసినట్టు అయింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు గాను పెద్ద ఎత్తున నామినేషన్ లు దాఖలయ్యాయి. మూడు రెవిన్యూ డివిజన్లపరిధిలోని పదిమండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 321 పంచాయతీలకు 1772 సర్పంచ్ నామినేషన్లు , 6382 వార్డు మెంబర్లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version