తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ధ్వంసం కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. ఆలయ పూజారి వెంకట మురళీ కృష్ణను ప్రధాన సూత్రధారిగా నిర్థారించారు సిట్ అధికారులు. రాజకీయ లబ్ది కోసం డబ్బులు ఆశ చూపి నేరం చేయించిన…స్థానిక టిడిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీరామనగర్ వరసిద్ది వినాయక ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులు ధ్వంసం చేశారు. దీనిపై పూజారి సహా టిడిపి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు..పూజారితో పాటు టీడీపీ, టీఎన్‌టీయూసీ నాయకులే విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డారని తేల్చారు. దీంతో ఈ అంశం మీద తెలుగుదేశం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.