ఈ బ్యాంక్ కస్టమర్లకు షాక్… కస్టమర్లపై ఎఫెక్ట్…!

-

తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో కస్టమర్ల పై ఎఫెక్ట్ పడనుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్లకు ఝలక్ తగిలింది. అయితే ఫిబ్రవరి 1 నుంచే రేట్ల తగ్గింపు నిర్ణయం అమలు లోకి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల పై వడ్డీ రేట్లను తగ్గించడం తో కస్టమర్లకు ఎఫెక్ట్ చూపనుంది.

గతం లో కన్నాఇప్పుడు తక్కువ వడ్డీ లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల పై 7 శాతం వడ్డీ లభించేది. కానీ ఇప్పుడు కొత్త నిర్ణయాల తో వడ్డీ రేట్లను 6 శాతానికి తగ్గిస్తూ నిర్ణయ తీసుకుంది. రూ.కోటి వరకు బ్యాలెన్స్‌కు ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే..? రుణాల పెరుగుదల కన్నా డిపాజిట్ల పెరుగుదల ఎక్కువగా ఉందని అందుకే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తెలిపింది.

ఇది ఇలా ఉండగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కన్నా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాల పై వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. SBI అయితే వడ్డీ రేట్లు 3 శాతం కన్నా దిగువునే ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల పై వడ్డీ రేట్లు మారుతూనే ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news