బంగారం కొనుగోలుదారుల‌కు షాక్.. మ‌ళ్లీ భారీగా పెరిగిన ధ‌ర‌లు

-

గ‌త రెండు రోజులుగా పెర‌గ‌కుండా.. బంగారం ధ‌ర‌లు ఈ రోజు మ‌రో సారి భారీ షాక్ ఇచ్చాయి. ఇప్ప‌టికే రూ. 53,000 అందుకుని సామాన్యుల‌కు ఊపిరి తీసుకోకుండా చేస్తున్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు మ‌రో సారి భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 400 నుంచి రూ. 430 వ‌ర‌కు పెరిగింది. గ‌త 6 రోజుల నుంచి ప్ర‌జ‌ల‌కు బంగారం ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. ఈ 6 రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 1,310 వ‌ర‌కు ధ‌ర‌లు పెరిగాయి.

అలాగే వెండి ధ‌ర‌లు కూడా సామాన్యుల కంటిపై క‌నుకు లేకుండా చేస్తున్నాయి. గ‌త వారం రోజుల నుంచే వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా వెండి ధ‌ర‌లు భారీగానే పెరిగాయి. కాగ గ‌త 6 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కిలో గ్రాము వెండి పై రూ. 2,000 వ‌ర‌కు ధ‌ర‌లు పెరిగాయి. కాగ నేటి ధ‌రల ప్ర‌కారం..

తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రాల్లో 10 గ్రాముల బంగారంలో.. 22 క్యారెట్ల‌కు రూ. 49,000 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 53,450కి చేరుకుంది. కాగ కిలో గ్రాము వెండి రూ. 73,700 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version