టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ కు భారీ షాక్ తగిలింది. హీరో సిద్ధార్థ్ పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ట్విట్టర్ లో అసభ్యకరమైన మెసేజ్ చేశారని ఒక మహిళ హీరో సిద్ధార్థ్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐసీసీ 509 సెక్షన్ల కింద హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
కాగ ఇటీవల హీరో సిద్ధార్థ్.. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నేహ్వాల్ పై ట్విట్టర్ వేదిక గా అసభ్యకరమైన పదాలతో వ్యాఖ్యలు చేశారు. ఈ సైనా పై సిద్ధార్థ్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ఘాటుగా స్పందించింది. సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను కూడా బ్లాక్ చేయాలని ట్విట్టర్ ను మహిళా కమిషన్ కోరింది. కాగ ఈ రోజు ఉదయం తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తు.. సైనాకు క్షమాపణలు తెలిపాడు.