ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి జగన్ షాక్‌ !

-

వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి జగన్ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ‘గడపగడపకు’ లో ఇప్పటివరకు అందించిన సహకారం మరువలేనిదని, తమకు ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్యే ఆనంకు జిఎస్డబ్ల్యూఎస్ కమిషనర్ మెసేజ్ పంపారు. గడపగడపకు ఇకపై వెళ్లొద్దంటూ ఇన్ డైరెక్ట్ గా ఆనంకు సూచించారు.

ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన ఆనంకు వైసీపీ వరుస వేధింపులకు దిగుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలో ఆనం సీనియర్ నేత అయినప్పటికీ పార్టీలోను, ప్రభుత్వంలోనూ తగిన ప్రాధాన్యత లేదని తొలి నుంచి అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇంతకాలం మౌనంగా వ్యవహరించిన ఆయన ఇటీవల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తమయ్యేలా వ్యాఖ్యాలు చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనంకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version