న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో టీమిండియా కు షాక్ తగిలింది. ఈ టెస్టు లో భాగం గా మూడో రోజు ఆట లో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయం లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు కుడి ముంచేతికి గాయం అయింది. దీంతో ఫీల్డింగ్ సమయం లో మైదానం లో కి మయాంక్ అగర్వాల్ రాలేదు. దీని పై బీసీసీఐ కూడా స్పందించింది. మయాంక్ అగర్వాల్ ముంచేతికి గాయం కావడం తో ముందస్తు చర్యల లో భాగం గా విశ్రాంతి ఇచ్చామని ట్విట్టర్ వేదిక గా స్పష్టం చేసింది.
అలాగే రెండో రోజు ఆట లో భాగం గా మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు కూడా గాయం అయింది. అతని మధ్య వేలికి గాయం కావడం తో మూడో రోజు జరిగిన రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా రాలేక పోయాడు. అయితే టీమిండియా ఆటగాళ్లు వరుస గా గాయాల పాలు కావడం తో ఒక విధం గా ఆందోళన కరంగా నే ఉంది. ఇప్పటి కే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తో పాటు అజిక్య రెహనే. ఇషాంత్ శర్మ గాయాల తో రెండో టెస్టు కు దూరం అయ్యారని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ గాయాల బెడద రాబోయే సౌత్ ఆఫ్రికా టూర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.