ఫ్లైట్ జర్నీ చేసే వారికి షాక్… టికెట్ ధరలు పెంపు..!

-

విమాన టికెట్ రేటుని పెంచడానికి కేంద్రం ఒప్పుకుంది. బ్యాండ్‌ను 30 శాతం వరకు పెంచుతూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా విమానం ప్రయాణం చేసే వాళ్లపై తీవ్ర ప్రభావం పడనుంది. విమాన టికెట్ల ప్రైస్ బ్యాంక్ పెంపు కారణంగా ఫ్లైట్ టికెట్ ధరలు కనీసం 10 శాతం పెరగొచ్చు. దీని మూలంగా 30 శాతం వరకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త చార్జీలు మార్చి 31 నుండి అమలులో ఉండొచ్చు. లేకపోతే కేంద్రం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రేట్లు యధావిధిగా ఉండొచ్చు.

ఇప్పుడు వచ్చిన కొత్త రెట్లని చూస్తే… ఢిల్లీ నుంచి ముంబై ఫ్లైట్ ధర రూ.3,900 నుంచి రూ.13,000 వరకు ఉంది. అదే పాత రేట్లు అయితే రూ.3,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. ఈ ధరలకు జీఎస్‌టీ, ప్యాసింజర్ సేఫ్టీ చార్జీలు, ఎయిర్‌ పోర్ట్ యూజర్ డెవలప్‌మెంట్ చార్జీలు వంటివి అదనం. ఇది ఇలా ఉండగా డీజీసీఏ గత ఏడాది మే నెలలో 7 ప్రైస్ బ్యాండ్‌లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తో మిషాలోపు ప్రయాణానికి టికెట్ ధర రూ.2,200 నుంచి రూ.7,800 పెరగనుంది. 40-60 నిమిషాలలోపు ప్రయాణానికి టికెట్ ధర రూ.2,800 నుంచి రూ.9,800 వరకు పెరగనుంది. 60-90 నిమిషాలలోపు ప్రయాణానికి ధర రూ.3,300 నుంచి రూ.11,700 వరకు పెరగొచ్చు.

అదే 90-120 నిమిషాలోపు ప్రయాణానికి ధర రూ.3,900 నుంచి 13,000 వరకు పెరగొచ్చు. 120-150 నిమిషాలలోపు ప్రయాణానికి రూ.5 వేల నుంచి రూ.16,900 వరకు పెరగొచ్చు. 150-180 అయితే ధర రూ.6,100 నుంచి రూ.20,400 వరకు పెరగొచ్చు. 180-210 నిమిషాలలోపు ప్రయాణానికి టికెట్ ధర రూ.7,200 నుంచి రూ.24,200 వరకు పెరగొచ్చు అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version