వామ్మో… దేశంలోని 62 శాతం మహిళలకు అదే పనంట!

-

ప్రస్తుతం ప్రపంచాన్ని టెక్నాలజీ శాసిస్తోంది. మొబైల్స్, కంప్యూటర్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. మనుషులు రోజంతా తిండి లేకుండా అయినా ఉండగలరేమో కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. పక్కపక్క ఇళ్లల్లో ఉన్నవాళ్లు సైతం ఒకరితో ఒకరు ఫోన్లలో మాట్లాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటే మొబైల్ మనిషి జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో సులభంగానే అర్థమవుతుంది.

తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో దేశంలోని మహిళల ఏకాంతాన్ని దూరం చేయడంలో స్మార్ట్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది. 62 శాతం మహిళలు మగాళ్లతో సెక్స్ చాట్ చేసి మజా పొందుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ‘plos one’ లో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రచురితమైంది. మహిళలు ఆన్ లైన్ వెబ్ సైట్స్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా కొత్త బంధాలను ఏర్పరచుకుంటున్నట్టు అధ్యయనంలో తేలింది.

భారత్ లోని 19 శాతం మంది మహిళలు సెక్స్ చాట్ యాప్స్ ద్వారా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. సర్వే నిర్వాహకులు ‘మొబైల్ సెక్స్-టెక్ యాప్స్’ అనే అంశం గురించి ప్రపంచంలోని 191 దేశాల్లో అధ్యయనం నిర్వహించారు. 1,30,885 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొనగా వీరిలో 23,093 మంది మన దేశ మహిళలు కూడా ఉండటం గమనార్హం.

సెక్స్‌టింగ్ ఒకప్పుడు పాశ్చ్యాత దేశాలకు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ద్వారా చాలా మంది మహిళలు సెక్స్ అవసరాలను తీర్చుకుంటున్నారు. ‘సెక్స్‌టింగ్’ కు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని… అపరిచితులతో సంబంధాలు మంచిది కాదని సర్వే నిర్వాహకులు చెబుతుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news