నాటుకోడి పులుసు ఎలా చేయాలో తెలుసా?

నాటుకోడి పులుసు.. ఈ పేరు వింటే చాలు ఎంతో పెదువులు తడుపుకుంటారు. కారణం దాని రుచి అంత అద్భుతంగా ఉంటుంది. పట్టణాల్లో పుట్టినవారికి ఈ నాటుకోడి టెస్ట్ గురించి తెలీదు కానీ పల్లెల్లో పుట్టి పెరిగిన వారికి నాటుకోడి పులుసు గురించి.. దాని టేస్ట్ గురించి బాగా తెలుసు. అందుకే పల్లెలో వారు పట్టణాల్లోకి వచ్చిన సరే ధర కాస్త ఎక్కువ అయిన నాటుకోళ్లని తినడానికే ఇష్టం చూపిస్తారు. మరి అలాంటి నాటుకోడి పులుసు ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రేపు ఆదివారం ఇంట్లో చేసుకొని మంచి భోజనాన్ని ఆస్వాదిద్దాం.

కావాల్సిన పదార్ధాలు..

నాటుకోడి మాంసం – 1 కేజీ,

ఉల్లిపాయలు – 2,

పసుపు – కొద్దిగా,

ఉప్పు – తగినంత,

కారం – 2 స్పూన్స్,

ధనియాల పొడి – 1 స్పూన్,

దాల్చిన చెక్క – చిన్న ముక్క,

ఎండుమిర్చి – 7,

నూనె – సరిపడా,

కొబ్బరి తురుము – 2 స్పూన్స్,

గసగసాలు – అరస్పూన్,

అల్లం – చిన్న ముక్క,

వెల్లుల్లి గడ్డ – 1,

మిరియాలు – అరస్పూన్

తయారీ విధానం..

కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కలను బాగా మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఆతర్వాత యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు బాగా వేయించి పొడిచేసి పక్కన పెట్టాలి. ఇక అనంతరం వాటిని కుక్కర్ లో వేసి ఉల్లిపాయలు, చికెన్ ముక్కలు పసుపు, ఉప్పు, తగినన్ని నీరు వేసి బాగా ఉడకపెట్టాలి. అనంతరం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలను వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ!