షాకింగ్: మరో నటి ఆత్మహత్య

-

సినీ పరిశ్రమలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి ఎక్కడో ఒక చోట ఎవరో ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కాస్త కలవర పెడుతున్నాయి. నిన్న ఒక నటుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నెల రెండున జరిగిన ఒక నటి మరణంకి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో భోజ్‌పురి నటి అనుపమ పాథక్ ఆగస్టు 2 న తన దాహిసర్ ఈస్ట్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె సూసైడ్ నోట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ముందు ప్రాధమిక విచారణలో భాగంగా ఇది ప్రమాదవ శాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేసారు. ఇప్పుడు ఈ కేసుని ఐపిసి సెక్షన్ 306 కి మార్చారు. అంటే ఆత్మహత్య చేసుకున్న కేసుగా దీన్ని నమోదు చేసారు. కాశీమిరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version