షాకింగ్; 250 కేజీల బరువున్న ఉగ్రవాది అరెస్ట్…!

-

సాధారణంగా ఉగ్రవాదులు అంటే ఎంత బరువు ఉంటారు…? వాళ్ళు ఫిట్ గా ఉండాలి కాబట్టి 70 లేదా 80 కేజీల లోపే ఉంటారు. కాని ఇరాక్ ఆర్మీ ఏకంగా 250 కేజీల బరువు ఉన్న ఉగ్రవాదిని మోసూల్ నగర్ లో అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో “జబ్బా ది జిహాదీ” గా పిలువబడే ఐసిస్ మతాధికారిని అరెస్టు చేశారు. 560 పౌండ్ల (250 కిలోల బరువు) బరువున్న, మతోన్మాదిని పోలీసులు,

కారులో ఎక్కించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో అతని కోసం ఒక ప్రత్యేక ఆర్మీ ట్రక్ తెప్పించారు అధికారులు. ఇరాక్ దళాల అధికారిక ప్రకటన ప్రకారం, పట్టుబడిన ముఫ్తీ అబూ అబ్దుల్ బారి “భద్రతా దళాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలకు” ప్రసిద్ది చెందాడని, ఉగ్రవాదుల ముఠాలో కీలక నాయకుడు అని అధికారులు పేర్కొన్నారు. ఐసిస్‌కు తమ విధేయతను చాటుకోవడానికి నిరాకరించిన,

ఇస్లామిక్ మతాధికారుల హత్యలకు ఫత్వా జారి చేస్తాడని అధికారులు పేర్కొన్నారు. లండన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద వ్యతిరేక కార్యకర్త మాజిద్ నవాజ్ ఫేస్‌బుక్‌లో బారిని మరియు అతని దుశ్చర్యలను ఎగతాళి చేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ రాశాడు, అతని అపారమైన బరువుని కూడా విమర్శించాడు. సిరియా ఇరాక్ లో అతను హత్యలకు ఆదేశాలు జారి చేస్తాడని, కదలలేకపోయినా దారుణాలు చేస్తాడని ఆరోపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news