షాకింగ్; స్టార్ హీరోకి కరోనా…!

-

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతుంది. దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తుంది అనే చెప్పవచ్చు. మొన్నటి వరకు చైనా కు పరిమితం అయిన ఈ వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ సహా అనేక దేశాలకు విస్తరించింది. గల్ఫ్ దేశాలను ఈ వైరస్ భయపెడుతుంది. దీనితో ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం భయపడుతుంది.

తాజాగా స్టార్ హీరో జాకీ జాన్ కి కరోనా వైరస్ సోకింది అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన హాంకాంగ్‌లోని ఓ ఆసుపత్రిలో నిర్బంధ చికిత్స తీసుకుంటున్నాడని జాకీచాన్ ఆరోగ్యంగా తిరిగిరావాలంటూ ఆలయాలలో పూజలు, చర్చిలలో ప్రార్ధనలు మొదలుపెట్టారు ఆయన అభిమానులు. చైనా మీడియా కూడా దీనిపై కథనాలు ప్రసార౦ చేయడం తో ప్రపంచం మొత్తం ఈ వార్తను నిజమే అనుకుంది.

దీనిపై ఆయన స్పందించారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన పడ్డ వాళ్లందరికీ ధన్యవాదాలని.. తాను వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, అందరి ఆశీస్సులతో తాను సురక్షితంగా, చాలా ఆరోగ్యంగా ఉన్నానని, తాను ఎవరి నిర్బంధంలో లేనని పేర్కొన్నాడు. అందరూ కరోనా నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version