నిందితుడు రాజు ఆత్మహత్యపై షాకింగ్ నిజాలు ఇవే !

-

చిన్నారి చైత్ర ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ వరంగల్ రైల్వే ట్రాక్ పై నిందితుడి మృతదేహం లభించింది. అయితే రైల్వే ట్రాక్ పై రాజు సూసైడ్ చేసుకున్న ఘటనపై పలు అనుమానాలు వస్తున్నాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో చివరిగా కనపడిన రాజు.. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో ఉప్పల్ కు చేరుకున్నాడు. చివరిసారిగా వైన్ షాప్ దగ్గర నడుచుకుంటూ వెళుతున్న సీసీటీవీ లో లభ్యం అయింది. ఇక ఉప్పల్ నుంచి దగ్గర్లో ఉన్న రైల్వే ట్రాక్ వరకు రాజు వెళ్ళినట్టుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ ఘాన్ పూర్ వరకు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నిన్న రాత్రి రైల్వే స్టేషన్ పైన నిద్ర పోయినట్లుగా చెప్తున్నారు పోలీసులు.. ఇవాళ ఉదయం పై నుంచి కిందకి దిగి సమీపంలోని సంఘటన స్థలం వరకు చేరుకున్న రాజు..రైల్వే ట్రాక్ రిపేర్ చేస్తున్న వాళ్ళ చూసి పొదల్లో దాచుకున్నట్లు ప్రత్యేక్ష సాక్షులైన రైల్వే కీమెన్లు చెబుతున్నారు.

అయితే ఈ రైల్వే కీమెన్లు వెళ్ళిన తర్వాత కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజు. ఆఅ తర్వాత రాజు చనిపోయిన విషయాన్ని రైల్వే సిబ్బందికి, మరియు పోలీసులకు రైల్వే కీమెన్లు సమాచారం ఇచ్చారు. ఆఅ తర్వాత మృత దేహం ఫోటోలను, వీడియోలను రైల్వే పోలీసులు పంపించారు అధికారులు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు డీజీపీ కి ఫోటోలు వీడియోలు పంపించారు రైల్వే ఉన్నతాధికారులు.. ఫోటోలు, వీడియోలు చూసి రాజు మృతదేహం గా గుర్తించారు అధికారులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version