గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి రిషీతో మాట్లాడి..శిరీష్ ని అనవసరంగా ఎంకరేజ్ చేస్తున్నారేమో అని, ఇది మీ పర్సనల్ విషయం కావొచ్చు… శిరీష్ రాకపోకలు తగ్గిస్తే మంచిది అంటాడు రిషీ. జగతి.. సార్ ఒకటి..వసూ చిన్నపిల్లేం కాదు, ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదో వసూకి బాగా తెలుసు. నేను చెప్పాల్సన అవసరం లేదు… తనా స్థాయిలో లేదు. రెండు..శిరీష్ తో తను చెప్పటం అన్నది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాకపోవచ్చు. కానీ వసూ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టేనేమో నెనెలా చెప్పలగలను. అయినా శిరీష్ వాళ్లఊరబ్బాయ్, ఫ్యామిలి ఫ్రెండ్. నేను వద్దూ అనటం కరెక్ట్ కాదేమో అని..అయినా కొందరి స్నేహాలు, కొందరి ప్రేమలు మనకు కనపడవు కదా సర్..అది వాళ్ల ఇష్టం, కొందరేమో మనం చెప్పినా కూడా ఒప్పుకోరు అంటుంది. రిషీకి ఎండరైక్ట్ గా తననే అంటుంది అని అర్థమవతుంది. జగతి వెళ్లిపోతుంది.
ఇంతలో మహేంద్ర వస్తాడు. విషయం మహేంద్రకు చెప్తుంది. నువ్వు బయటకు వెళ్లాలి, రిషీ దగ్గర పర్మిషన్ తీసుకోడానికి బయపడుతున్నావ్ అంతే కదా నేను చెప్తాను లే నువ్వెళ్లు అంటాడు. ఎదుటివాళ్లను బాగా అర్థం చేసుకుంటారు మీరు అంటుంది వసూ.. మహేంద్ర వసూకి నాలుగు మంచి మాటలు చెప్తాడు. ఇండైరెక్టగా..శిరీష్ కి వసూ తను రిషీతో వెళ్లింది చెప్పటం కరెక్ట్ కాదన్నట్లు చెప్తాడు. వసూ మీరేం చెప్పాలనుకున్నారో నాకు అర్థమైంది సర్ అని వెళ్తుంది.
ఇంతలో రిషీ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా నేను వసుధార ఒకచోటకు వెళ్లొచ్చాం, అక్కడి వివరాలు మీతో చెప్పాలి. అందుకే అనుకోకుండా మీటింగ్ ఏర్పాటు చేశాను అని బస్తీ విజిట్స్ కి సంబంధించి మరికొన్ని వివరాలు వసుధార చెప్తుంది అంటాడు. అటెండర్ ని పిలిచి వసుధారను పిలవండి అంటాడు. ఇంతలో మహేంద్ర వసుధార ఏదో పని ఉందని బయటకువెళ్లింది అంటాడు. రిషీ..జగతిని అడుగుతాడు వసుధార మీ పర్మిషన్ తీసుకునే వెళ్లి ఉంటుంది కదా అని అడుగుతాడు. మహేంద్ర నాకు చెప్పింది అంటాడు. మీరు ఈ కాలేజ్ లో బోర్డ్ మెంబర్.. పర్మిషన్ అంటూ ఇస్తే..మేడమ్ గారే ఇవ్వాలి, లేదా నన్ను అడగాలి. మాట్లాడండి మేడమ్..పర్మిషన్ తీసుకుందా అని అడుగుతాడు. జగతి లేదు సార్ అంటుంది.
రిషీ.. ఎటకారంగా ఓహో..పర్మిషన్ తీస్కోలేదా..అయినా తను మీ స్టూడెంట్, మీ ప్రియశిశ్ష్యురాలు, మీ పర్మిషన్ లేకుండా కాలుబయటపెట్టదు, మీరు బయటకి తనను ఎవరితోనూ పంపించరు కదా మేడమ్ అంటాడు. తను నా అసిస్టెంట్ కదా మేడమ్, కనీసం నాకైనా చెప్పాలి కదా..మర్చిపోయిందోమే..లేక అవసరం లేదమే అంటాడు. జగతిని తప్పుపడతాడు. సిద్దాంతాలు పద్దతులు ఎటుటివారికి చెప్పేడప్పుడు మనం కూడా పాటించాలని ఎక్కడో చదివాను అంటాడు. జగతికి మ్యాటర్ అర్థమవుతుంది. పర్మిషన్ లేదని ఆరోజు జగతి రిషీని ఆపింది..దానికి ఈరోజు రిషీ బదులు తీర్చుకుంటున్నాడు అనుకుని, వసూ ఏంటో నన్ను బాగా ఇరికించింది అనుకుంటుంది. సర్లే మేడమ్..మీకు చెప్పకుండా వెళ్తే మీ తప్పు ఎలా అవుతుందిలే ఫోన్ చేద్దాం ఎక్కడున్నా రమ్మని చెప్దాం అని ఫోన్ చేస్తాడు. మహేంద్ర మనసులో రిషీ కూల్ గా మాట్లాడుతునే జగితిని మాటలతో కోసేస్తున్నాడు అనుకుంటాడు.
కారులో శిరీష్ వసూ వెళ్తూ ఉంటారు. ఇంతలో రిషీ కాల్ వస్తుంది. ఎవరు వసూ అని శిరీష్ అంటాడు. రిషీ సార్ ఫోను చేస్తున్నారు, చెప్పకుండా వచ్చాను కదా ఏం అంటారో అని భయంగా ఉంది అని వసూ అంటుంది. నీ భయాన్ని నేను పోగొడ్తా అని శిరీష్ వసూ ఫోను తీసుకుని కాల్ కట్ చేస్తాడు. సెల్ ఫోన్ మోగదు, నీకింక భయం లేదు అంటాడు. వసూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రిషీకి ఇంకా కాల్తది. పర్మిషన్ తీసుకోదు, ఇన్ఫర్మేషన్ ఉండదు యూత్ ఐకాన్ అంటే ఇలానే ఉండాలని తనకెవరైనా చెప్పారేమో అని రిషీ అంటాడు. జగతి మనసులో రిషీ.. నీకు అడ్డంగా దొరికాను ఇంక ఆపరా బాబు అనుకుంటుంది. రిషీ మీటింగ్ ఇక్కడితో అయిపోయింది అని వెళ్లిపోతాడు. జగతి మహేంద్రను అడుగుతుంది. వాళ్లు అలా కొంచెం సేపు మాట్లాడుకుంటారు.
ఇటుపక్క శిరీష్ వసూలు రెస్టారెంట్ కి వెళ్తారు. శిరీష్ వాళ్ల అమ్మానాన్న మ్యారెజ్ డేకి గిఫ్ట్ తీసుకుని ఇద్దరు జాలీగా మాట్లాడుకుంటారు. వసూ మాత్రం నీకేం బాబు బానే ఉన్నావు..కానీ నాకే భయంగా ఉంది. రిషీ సార్ కి చెప్పకుండా వచ్చాను చూడూ.. ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో అంటుంది. ఇద్దరు రిషీ గురించి కాసేపు మాట్లాడుకుంటారు. మోన్న నువ్వు పంపిన మెసేజ్ రిషీ సార్ కూడా చూశారు అంటుంది వసూ.. శిరీష్ షాక్ అవుతాడు. బుర్రవేడెక్కిపోయింది వెళ్లి కాఫీ తీస్కురా అంటాడు. మెసేజ్ రిషీ సార్ చూడాల్సింది కాదేమో..రేపు ఎప్పుడైనా ఆయన ఎదురుపడితే నా ముఖచిత్రం ఏంటో అనుకుంటాడు.
కాలేజ్ లో రిషీ కారు దగ్గరు వెళ్తూ ఉంటాడు. మహేంద్ర వచ్చి రిషీ రిషీ అని పిలుస్తాడు. రిషీ కోపంగా ఏం డాడ్ లిఫ్ట్ కావాలా, మీ రూట్ వేరు నా రూట్ వేరు అంటాడు. మహేంద్ర మనం వెళ్లే దా రిగురించా, కారు వెళ్లే దారి గురించా అని అడుగుతాడు. మీకు ఎలా అర్థమైతే అలా అర్థంచేసుకోండి అంటాడు రిషీ. అయినా లిఫ్ట్ గురించి కాదులో, కారుంది అంటాడు మహేంద్ర. ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారంటారు అంతేగా అని రిషీ అడుగుతాడు. నేనెందుకువచ్చానంటే..పాపం వసుధార చెప్పివెళ్లింది కదా నాకు చెప్పే వెళ్లింది అంటాడు మహేంద్ర. ఈ మాట మీటింగ్ లో చెప్పారు కదా నాకు. కొంపతీసి మీక్కూడా చెప్పలేదా.. వసుధారను కాపడటానికి మీరు అబద్దం చెప్పారా అని రిషీ అడుగుతాడు.
ఏంటీ రిషీ నువ్వు, చెప్పే వెళ్లింది. నేను నీకు అబద్దం చెప్తానా చెప్పు అంటాడు. మీ పేరు మహేంద్ర బూషన్, సత్యహరిచంద్ర కాదుగా అంటాడు రిషీ. మహేంద్ర నవ్వుతూ..అంటే శిరీష్ ఏదో అర్జెంట్ పనుందంటే వెళ్లింది అంటాడు మహేంద్ర. ఈ టాపిక్ తో మీకు సంబంధం లేదుగా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అంటాడు. తనని తిడతావేమో అని అంటాడు మహేంద్ర. అయితే శాలువా, ఫ్లవర్ బొకే తెప్పించండి సన్మానం చేద్దాం అంటాడు రిషీ.. కాలేజ్ సమయం వృద్ధా చేసిందని వసూని తిడతాడు. అలా అంతా చెప్పి మీరేంటి ఈ మధ్య వసుధారకు సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతాడు. ఏ లేదు.. నా సపోర్డ్ ఎప్పుడు నీకే ఉంటుంది అంటాడు మహేంద్ర. బాగా అర్థమవతుందిలే నేనిక వెళ్లొచ్చా అని చెప్పి రిషీ కార్ తీస్తాడు. కారులో కుర్చుని రిషీ..డాడ్ నా పనుల్లో, నా సమస్యల్లో మీరు జోక్యం చేసుకోకండి అంటాడు. సరే రిషీ అసలు జోక్యం చేసుకోను అని చెప్తాడు. రిషీ వెళ్లాక మాత్రం..నువ్వు చెప్తే నేను వినలా, నువ్వు రిషేంద్రబుషన్ వి అయితే నేను మహేంద్ర బూషన్ అనుకుంటాడు. నేను వసూ ఉన్నదే నీకు ఉన్న పెద్ద సమస్యను పరిష్కరించడానికి రిషీ అనుకుంటాడు. ఈ సీన్ భలే కామెడిగా ఉంటుంది.
కారులో వెళ్తున్న రిషీ..వసూ పర్మిషన్ లేకుండా వెళ్లటం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.